![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-59 లో.....అసలు ప్రేమ అంటే పడదు కదా ఎలా పెళ్లి చేసుకున్నావని ఇంట్లో వాళ్లు అడుగుతుంటే.. ఎక్కడ ధీరజ్ నిజం చెప్తాడోనని నర్మద వచ్చి కవర్ చేస్తుంది. నాకైనా చెప్పి ఉండాల్సిందని చందు, తిరుపతి అంటుంటే దానికి కూడా నర్మద సమాధానం చెప్తుంది. ఏంటి వాడిని అడుగుతుంటే.. నువ్వు సమాధానం చెప్తున్నావని కామాక్షి అంటుంది. మీకు ఎవరు చేప్తే ఏంటి సమాధానం కావాలి కదా అని నర్మద అంటుంది. వాడిని అడిగితే తను సమాధానం చెప్తుంది ఇందులో ఏదో మతలబు ఉందని కామాక్షి అనుకుంటుంది.
ఆ తర్వాత వేదవతిని భద్రవతి చూసి.. కావాలనే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు.. నా లాగే నా మేనకోడలికి మీరంటే ఇష్టం లేదు.. ఎలా నా కోడలిని రప్పించుకోవాలో నాకు తెలుసని భద్రవతి అంటుంది. మరొకవైపు సేనాపతికి పెద్దావిడ కాఫీ తీసుకొని వస్తుంది. తను తీసుకోడు. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందోనని రేవతి బాధపడుతుంటే.. వేదవతి కూతురు లాగా చూసుకుంటుంది.. ఎప్పటికైనా ఈ రెండు కుటుంబంలు కలిసేవే కదా అని పెద్దావిడ అంటుంది. దాంతో విశ్వ కోపంగా ఎప్పటికి కలవవని అంటాడు. కాసేపటికి కోపంగా ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్లి గొడవ పెట్టుకుంటాడు. నా చెల్లికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళావంటూ గొడవ పడుతుంటే.. నా తమ్ముడు జోలికి రాకని సాగర్, చందులు విశ్వకి వార్నింగ్ ఇస్తారు.
ఆ తర్వాత ధీరజ్ గదిలోకి వస్తాడు. ప్రేమ నిద్రపోతుంటుంది. బయట అంత గొడవ జరుగుతుంటే ఎంత బాగా నిద్రపోతున్నావంటూ లేపుతాడు. ఇక ప్రేమ నిద్రలేచి కాఫీ అని అంటుంది. ధీరజ్ ని చూసి నువ్వు మా ఇంట్లో ఏంటి అని ప్రేమ అనగానే .. ఒకసారి జరిగింది గుర్తుచేసుకోమని ధీరజ్ చెప్తాడు. దాంతో ప్రేమ అంత గుర్తు చేసుకుంటుంది. కాఫీ కావాలని అంటుంది. అప్పుడే నర్మద వచ్చి ధీరజ్ ని తీసుకొని వెళ్లి తనతో ప్రేమకి కాఫీ పంపిస్తుంది. ఆ తర్వాత రామరాజు ఇంట్లో ఎక్కడ కన్పించకపోయేసరికి అందరు టెన్షన్ పడుతుంటారు. మీ నాన్న గారు ఇంట్లో నుండి వెళ్లి పోయారని వేదవతి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |